Home > Featured > యాక్సిడెంట్ చేసిన కుమారుడిని పోలీసులకు పట్టించిన ఎంపీ

యాక్సిడెంట్ చేసిన కుమారుడిని పోలీసులకు పట్టించిన ఎంపీ

Police Arrested Mp Son In West Bengal

తాగిన మత్తులో వాహనం నడిపిన ఎంపీ కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కత్తా బీజేపీ ఎంపీ రూపా గంగూలీ కుమారుడు అర్థరాత్రి సమయంలో తాగిన కారు నడుపుతూ ఓ గోడను ఢీ కొట్టాడు. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో ఇంట్లో నుంచి తల్లిదండ్రులు బయటకు వచ్చారు. అతన్ని జాగ్రత్తగా బయటకు తీశారు. స్వల్ప గాయాలతో ఆకాష్ బయటపడ్డారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

యాక్సిడెంట్ పై ఎంపీ రూప గంగూలీ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తన కుమారుడు ఇంటి వద్ద కారు డ్రైవింగ్ చేస్తూ గోడను ఢీ కొట్టినట్టు తెలిపారు. తానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి రప్పించానన్నారు. చట్టపరంగా ఆకాష్ పై చర్యలు తీసుకునే విధంగా ఈ పనిచేసినట్టు చెప్పారు. దీంట్లో ఎటువంటి రాజకీయ జోక్యం ఉంబోదని స్పష్టం చేశారు. తన కొడుకు అంటే ప్రేమ ఉన్నా చట్టపరంగా అందరూ సమానమేనని ఆమె పేర్కొన్నారు.

Updated : 16 Aug 2019 1:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top