Police arrested Vandana in Assam
mictv telugu

భర్త, అత్తను చంపి ఫ్రిడ్జిలో పెట్టిన వివాహిత.. తండ్రి షాకింగ్ రియాక్షన్

February 20, 2023

Police arrested Vandana in Assam

ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇదే తరహా ఘటనలు అక్కడక్కడా వెలుగు చూశాయి. ఇందులో కామన్ థింగ్ ఏంటంటే.. అప్పటివరకు సహజీవనం చేసి పెళ్లి చేసుకోమని ప్రియురాలు ఒత్తిడి చేస్తే ప్రియుళ్లు వారిని దారుణంగా హత్య చేశారు. అనంతరం శరీరాన్ని ముక్కలు చేసి గుర్తు తెలియని ప్రదేశాల్లో పడేశారు. కానీ అస్సాంలో సీన్ రివర్స్ అయింది. ఓ వివాహిత తన భర్త, అత్తను చంపి ముక్కలు చేసి వాటిని తన ఇంటి ఫ్రిడ్జిలో దాచి పెట్టింది. ఆరు నెలల తర్వాత ఈ ఘోరం బయటపడడంతో దేశవాసులు బిత్తరపోయారు. ఈ ఘటనతో హత్యలకు ఆడ, మగ, మతం, కులం, ధనిక, పేద అనే తేడాలేదనే విషయం నిరూపణ అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పూర్తి వివరాల్లోకెళితే.. గౌహతి సమీపంలోని నూన్‌మతికి చెందిన వివాహిత వందన తన భర్త అమర్ జ్యోతిడేతో కలిసి నివసిస్తోంది. వందన అత్త శంకరీ డే మరో భవనంలో ఒంటరిగా కాలం గడుపుతోంది. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న వందన.. తన ప్రియుడితో కలిసి భర్త, అత్త ఆస్తిని కాజేయాలని ప్రణాళిక వేసింది. కుట్రతో భర్త, అత్తను చంపి వారిని ముక్కలు చేసి ఫ్రిడ్జిలో దాచి పెట్టింది. మూడ్రోజుల తర్వాత 150 కిలోమీటర్లు ప్రయాణించి మేఘాలయలోని చిరపుంజీ వద్ద కొండలు, గుట్టల్లో శరీర భాగాలను ప్రియుడితో కలిసి పారేసి సైలెంటుగా ఉండిపోయింది. తిరిగొచ్చి ప్రియుడితో ఏడు నెలలుగా ఎంజాయ్ చేస్తూ హత్య విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది.

పోలీసులకు గానీ, తండ్రికి తెలియకుండా రహస్యంగా ఉంచింది. కానీ నిజం ఎంతో కాలం దాగదు కదా. వీరి సమీప బంధువు భర్త, అత్తల గురించి ఆరా తీయడంతో పొంతన లేని సమాధానాలు చెప్పగా, చివరికి విషయం పోలీసుల వద్దకు చేరింది. వారు తమదైన శైలిలో వందనను విచారించి అసలు నిజాన్ని రాబట్టారు. వివాహేతర సంబంధం గురించి అత్త, భర్త హెచ్చరించడంతో హత్య చేసినట్టు ఒప్పుకుంది. ఫిబ్రవరి 19న ఈ దారుణం వెలుగులోకి రాగా, పోలీసులు వందనతో పాటు ఆమె ప్రియుడు అరుప్ డేక, అతని స్నేహితుడు ధాంజిత్ డేకాలను అరెస్ట్ చేశారు. అటు కూతురు చేసిన ఘోరంపై తండ్రి స్పందించాడు. అత్త, భర్తల గురించి అడిగిన ప్రతీసారి అబద్ధం చెప్తూ నాటకాలు ఆడిందని, నేరం రుజువైతే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాలని కోరుతున్నాడు.