ఖాకీలు..మీరేం చేసినా చెల్లుతదా ? - MicTv.in - Telugu News
mictv telugu

ఖాకీలు..మీరేం చేసినా చెల్లుతదా ?

August 3, 2017

ఒంటిమీద ఖాకీ,నెత్తిమీద టోపీ,చేతిలో లాఠీ ఉంటే ఎలా అయినా ప్రవర్తిస్తారా?మీరేం చేసినా చెల్లుతదా?ఆడవాళ్లు మొగవాళ్లు అనే తేడాలేకుండా అందరిని ఒకేలా చూస్తారా?అసభ్యంగా మాట్లాడడం ,దౌర్జన్యం చెయ్యడం పోలీసుల హక్కా?డ్యూటీలో చేరక ముందు ట్రేనింగ్ లో నేర్చుకున్న సంస్కారం ఇదేనా? ఈ ప్రశ్నలన్నీ పక్కన పెడితే అసలు విషయంలోకి వెళ్లిపోదాం.

ప్రగతి భవవన్ ముందు  యూరోపియన్ హెల్త్  కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ఆందోళనకు దిగారు తమ సమస్యలు తీర్చాలని…నిరసనలు చేశారు,అలా నిరసనలు చేస్తున్న ఆడవాళ్లపై  మగ పోలీసల దౌర్జన్యం…ఆడవాళ్లను గుంజుకుంటూ  వాళ్లు కిందపడి ఏడ్చినా కూడా పట్టించుకోకుండా వ్యాన్ లోకి ఎక్కించారు…వాళ్ల సమస్యల్ని  అడిగి తెలుసుకునేందుకు  ప్రయత్నించిన మీడియా వాళ్లపై కూడా పోలీసులు బూతులు తిట్టుకుంటూ దురుసుగా ప్రవర్తించారు.

పోవే అవుతలికి అని 10 టీవీ రిపోర్టర్ రాధికను నూకేసారు పంజాగుట్ట ఏసిపి  వెంకటేశ్వర్లు గారు..అంతేకాదు  మిగతా మీడియా వాళ్ల మైకులు గుంజుకుంటూ వాళ్లను నెట్టేస్తూ బూతులు తిట్టారు.ఏంది పోలీస్ సారు ఇది. ఒక మహిళా జర్నలిస్టును పట్టుకొని  పోవే అవుతలికి అని అంత అసభ్యంగా ప్రవర్తించడం ఏంది సారు…మీ డ్యూటీ మీరు చేస్కుంటే… వాళ్ల డ్యూటీ వాళ్లు చేసోవద్దా?పబ్లిక్ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం..న్యూస్ ను కవర్ చెయ్యడం.. ఒక జర్నలిస్టులుగా వాళ్ల బాధ్యత. వాళ్ల పని వాళ్లు చేసుకోకూడదా?మైకులు పెడ్తారు,సమస్యల గురించి అడుగుతారు,మీకు ఇష్టం ఉంటే జవాబులు చెప్పచ్చు లేకపోతే ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్లిపోవచ్చు కానీ  ఒక బాధ్యతగల వృత్తిలో ఉండి ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఏందిసారు.మీ భాష ,ప్రవర్తన ఇప్పటికైనా మార్చుకోండి సారు.ఇగ ఈవిషయం మీద అటు తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం(TUWJ) వాళ్లు తీవ్రంగా ఖండించారు.