గుప్తనిధుల కోసం దొంగలుగా మారిన పోలీసులు! - MicTv.in - Telugu News
mictv telugu

గుప్తనిధుల కోసం దొంగలుగా మారిన పోలీసులు!

October 25, 2019

Police Attempts for Treasure Hunt

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్టుగా దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే వక్రమార్గం పట్టారు. స్వయంగా పోలీసులే గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడుతూ చిక్కారు. ఓ చోట తవ్వకాలు జరుపుతుండగా ఈ ముఠాను పట్టుకున్నారు. గుప్త నిధుల దొంగల కోసం మాటు వేసిన ఎస్‌వోటీ పోలీసులకు ఆ శాఖకు చెందిన వారే చిక్కారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఈ ఘటన జరిగింది. 

కొంత కాలంగా తుర్కపల్లి సమీపంలో గుప్త నిధుల తవ్వకాలు జరుగుతున్నాయని ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నిఘా పెట్టారు. తవ్వకాలు జరుపుతుండగా నలుగురిని పట్టుకున్నారు. తీరా వారి గురించి ఆరా తీస్తే ముగ్గురు వ్యక్తులు పోలీసులే కావడంతో ఆశ్చర్యపోయారు. పట్టుబడిన వారిలో చౌటుప్పల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, మరో కానిస్టేబుల్ ప్రభాకర్, భువనగిరి హోంగార్డు రామకృష్ణగా గుర్తించారు.

వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. వారి వెనక ఉన్నవారివివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పోలీసులే ఇలా తవ్వకాలు చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.