జనతా కర్ఫ్యూ.. రోడ్డుపైకి వస్తే కొడుతున్న పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

జనతా కర్ఫ్యూ.. రోడ్డుపైకి వస్తే కొడుతున్న పోలీసులు

March 22, 2020

Police beating a man in kodad bus stand area

ప్రధాని పిలుపు మేరకు ఆదివారం ఉదయం నుంచే దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభమైంది. రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది. అన్ని రాష్ట్రాలు స్వచ్చంధంగా ఈ కర్ఫ్యూలో పాల్గొంటున్నాయి. కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణలో సోమవారం ఉదయం ఆరు గంటల వరకు జనతా కర్ఫ్యూ కొనసాగనుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా 3,700 రైళ్లు నిలిచిపోనున్నాయి. సాయంత్రం 5 గంటలకు దేశమంతా ప్రజలు ఇళ్ల ముంగిట్లో నిలుచొని సంఘీభావం తెలపాలని ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు బంద్ అయ్యాయి. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంక్‌లకు మినహాయింపు ఇచ్చారు. పాలు, కూరగాయలను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రతి డిపోలో ఐదు బస్సులు, ఐదు మెట్రో రైళ్లను అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా కర్ఫ్యూను పాటించాలని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. అయితే కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్నా వాళ్ళను పోలీసులు ఇళ్లలోకి పంపిస్తున్నారు. ఈ సందర్భంగా పని లేకున్నా బయట ఇతురుగుతున్న ఆకతాయిలను పోలీసులు కొట్టి మరీ ఇళ్లకు పంపిస్తున్నారు. తాజాగా కోదాడ బస్సు స్టాండ్ లో రోడ్డుపై తిరుగుతున్నా ఓ ఆకతాయికి పోలీస్ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నార్త్ ఇండియాలో కూడా కర్ఫ్యూ పాటించకుండా బయట తిరుగుతున్న వ్యక్తులను పోలీసులు కట్టడి చేస్తున్నారు.