ఏందా కొట్టుడు.. పోలీసువా? పోరం బోకువా? - MicTv.in - Telugu News
mictv telugu

ఏందా కొట్టుడు.. పోలీసువా? పోరం బోకువా?

August 2, 2017

ఆయన పేరు అంతిరెడ్డి,కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ఎస్సై, పేరు అంతి రెడ్డి కానీ ఆయన చేసిన నిర్వాకం చూస్తే  అతి రెడ్డి అని పిలిస్తే సరిపోతుంది. కామారెడ్డి  జిల్లా నిజాం సాగర్ మండలం కోమలంచ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మొబైల్ దొంగతనం చేసిండనీ..ఎస్సై అంతిమరెడ్డి రాజును అదుపులోకి తీసుకుని విచారించిండట,ఫోన్ ను అమ్మిన పైసల్ను మా అమ్మకు ఇచ్చినా అని రాజు ఎస్సై కి  జెప్పిండట.గంతే ఎస్సై కి బీపి వెర్గింది.ఎంబట్నే ఎంబట బలగంతోని అర్ధ రాత్రి 1గంటలకు రాజు ఇంటికి వొయ్యి తలుపు కొట్టి..నీ కొడుకు పైసలిచ్చిండట,ఏడ వెట్టినవ్ అని గద్మాయించిండట, నీ బాంచెన్ సారు  నాకేం తెల్వది,నా కొడ్కు నాకు పైసలియ్యలేదు అని ఎస్సై సారు కాళ్లమీద పడి బ్రతిమిలాడినా ఇన్లేదట నాలుగో సింహం,లాఠీలతోని శెప్తవా శెప్పవా అని రాజు తల్లి బాలమణిని ఇస్టమచ్చినట్టుకొట్టిండట.

అయినా పోలీస్ సారు కోపం సల్లారలే..పోలీస్ జీప్ లో ఎక్కించుకుని తీస్కపొయ్యి..నేను కొట్టిన ముచ్చట ఎవలికైనా శెప్పినవో సంపేస్తా అని బూతులు తిట్టుకుంట ఊరు శివర్ల వదిలేశిపోయిండట.మల్లా రేపు పిలుస్తా స్టేషన్ కు రావాలే అని వార్నింగ్ గుడ ఇచ్చిండట.

ఇది నిజాంసాగర్ ఎస్సై అంతిరెడ్డి గారు..పబ్లిక్ పై సూపిచ్చిన అసలు సిసలైన ఫ్రెండ్లీ పోలిసింగ్, సరే ఆ రాజనెటోడు దొంగతనం జేశిండనుకుందాం…ఆ పైసలు వాళ్లమ్మకు ఇచ్చిండనుకుందాం, కనీ విచారణ జేశే పద్దతి ఇట్లనా సారు…పోలీసులంటే పబ్లిక్ల మంచి ఒపీనియన్ లేదనే..ఓదిక్కు సర్కారోళ్లు పోలీసులందర్ని పబ్లిక్ తోని ప్రెండ్లీ పోలిసింగ్ జెయ్యిమంటే…నువ్వేంది సారు  రివర్స్ ప్రెండ్లీ పోలిసింగ్ జేస్తున్నవ్ అని తిట్టుకుంటున్నరట గీ పోలీసు సారు ఘనకార్యం తెల్శినోళ్లంత.