అస్సలు పోలీసోళ్లకేమైంది. ఇలా ఎందుకు చేస్తున్నారు..! - MicTv.in - Telugu News
mictv telugu

అస్సలు పోలీసోళ్లకేమైంది. ఇలా ఎందుకు చేస్తున్నారు..!

May 15, 2017

మొన్న ఖమ్మంలో రైతులకు బేడీలు వేశారు..ఇవాళ ధర్నా చౌక్ లో సివిల్ డ్రెస్ లో స్థానికులమంటూ సీఐ శ్రీదేవి సహా మహిళా కానిస్టేబుల్స్ ధర్నాకు దిగారు.విపక్ష పార్టీల కార్యకర్తలపై రణరంగంలో వీరవిహారం చేశారు. ఇవి చూస్తుంటే రానురాను పోలీసోళ్లకు సోయి లేకుండా పోతోంది. ఏం చేస్తున్నారో..ఎందుకు చేస్తున్నారో ..ఎవరి మెప్పు కోసం చేస్తున్నారో వాళ్లకే తెలియాలి. స్వచ్ఛందగా స్వచ్ఛ్ తెలంగాణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఓకే…మరి బరితెగించి ధర్నాల్లో ఎందుకు పాల్గొన్నారు.

అన్నం పెట్టే రైతన్నను ఆదుకోకపోయిన సరే ఎందుకు బేడీలు వేశారు. కనీస మానవత్వం కూడా వీరికి ఎందుకు ఉండటం లేదు..సరే ఆన్ డ్యూటీ అనుకుందాం..ఎవరి ఆదేశాలతో ఇలా చేస్తున్నారు. డీఎస్పీ చెబితే చేస్తున్నారా..డీజీపీ ఆదేశిస్తే చేస్తున్నారా..లేక మరెవైనా బలవంతపెడుతున్నారా..లేదా గులాబీ అభిమానం అలా చేయిస్తుందా…అస్సలు వీళ్ల మానసిక స్థితి సరిగ్గానే ఉందా…వీళ్ల చేష్టల్ని చూస్తే ఎర్రగడ్డకు పంపించాల్సిన అవసరం ఉందేమో అనిపించేలా ఉంది.

ధర్నా చౌక్ తరలించొద్దని అఖిలపక్షం..తరలించాలని మరికొందరు పోటాపోటీగా ధర్నాకు దిగాయి. ఇరువర్గాలు పరస్పరం జెండా కర్రలతో కొట్టుకున్నాయి. ఈ ధర్నాలో సివిల్ డ్రెస్సులో కొందరు పోలీసులు పాల్గొనడం విస్మయపరిచింది. ధర్నాచౌక్ ను తరలించాల్సిందేనంటూ స్థానికులమంటూ ధర్నా చేస్తున్నవారికి వీరు మద్దతుగా నిలిచారు. వారిలో కలిసిపోయి రచ్చ రచ్చ చేశారు. హాయిగా డ్యూటీ చేసుకోవాల్సిన మహిళ పోలీసులు ఇలా ఎందుకు చేశారు. ఇప్పుడు వీరి విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మొన్నటికి మొన్న ఖమ్మం మార్కెట్‌ యార్డు విధ్వంసం ఘటనలో రిమాండ్‌లో ఉన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం దుమారం రేపింది. పోలీసులు అత్యుత్సాహంతో రైతులను కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లతో తీసుకురావడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో పోలీసు ఉన్నతా ధికారులు వెంటనే స్పందించారు. అత్యుత్సాహంతో రైతులకు బేడీలు వేసి తీసుకువచ్చిన ఇద్దరు ఏఆర్‌ ఎస్సైలను సస్పెండ్‌ చేయడంతోపాటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఈ ఘటన జరిగి వారం అయిందో లేదో మళ్లీ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఇందిరా పార్క్ దగ్గర స్థానికుల ముసుగులో కూర్చున్న సీఐ శ్రీదేవి సహా 20 మంది మహిళా కానిస్టేబుళ్లపై వేటేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీరిపై చీటింగ్ పెట్టాలని కోరుతున్నారు. మరి సర్కార్ సస్పెండ్ చేస్తుందో..వెనకేసుకు వస్తోందా చూడాలి.ఇందులో కొసమెరుపు ఏంటంటే స్థానికులకు ఇబ్బందులు కలుగుతుందని ధర్నా చౌక్ ను తరలిస్తున్నామని సర్కార్ చెబుతుంటే… ధర్నాకు దిగిన విపక్ష కార్యకర్తలకు స్థానికులు మంచినీళ్లు అందివ్వడమే కాదు..తమకు ఏలాంటి ఇబ్బంది లేదని చెప్పడం.
మొత్తానికి అత్యుత్సాహం చూపుతోన్న కొందరి పోలీసుల తీరు దుమారానికి దారితీస్తోంది. వీటికి అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉంది.

HACK:

  • Police Brutal Behaviour on Farmers.
  • Social Activists demanding justice for Farmers harassed by Police.