ఇందిరా గాంధీ అక్రమసంతానం అన్న నటిపై కేసు  - MicTv.in - Telugu News
mictv telugu

ఇందిరా గాంధీ అక్రమసంతానం అన్న నటిపై కేసు 

October 12, 2019

Police Case Against Payal Rohatgi

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ తోపాటు ఆయన కొడుకు, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దంపతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి పాయల్ రోహత్గిపై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ నేత చర్మేష్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్ 66, 67 కింద కేసు నమోదు చేశారు.

గత నెల 21 పాయల్ నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వీడియోను ఫేస్‌బుక్‌లో చేసింది. ‘ఇందిరాగాంధీ.. నెహ్రూ, కమలా నెహ్రూ దంపతులకు పుట్టలేదు. ఆమె అక్రమ సంతానం. ఇందిరగాంధీ.. లాల్ బహదుర్ శాస్త్రిని పాకిస్తాన్‌తో చర్చల కోసం తాష్కెంట్‌కు పంపి విషం ఇచ్చి చంపేయించింది.. ’ అని ఆరోపించింది. జాతి నాయకుల గురించి, దేశం గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకునేలా ఈ వీడియో ఉందని మండిపడ్డారు.