యువరాజ్ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు - MicTv.in - Telugu News
mictv telugu

యువరాజ్ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

February 15, 2021

vuu

దళితులను కించపరిచినట్లు దాఖలైన కేసులో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై హరియాణా పోలీసులు కేసు నమోదు చేశారు. భంగీ కులాన్ని అవమానించినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అభియోగాలతోపాటు, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

యువరాజ్ గత ఏడాది జూన్ ‌నెలలో మరో క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ షోలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువ క్రికెటర్ యజువేంద్ర చాహల్‌ను ఉద్దేశించి ‘భంగీ’ అన్నాడు. భంగీ అనేది చర్మకార దళిత కులం. అప్పట్లో దీనిపై తీవ్ర వివాదం రేగింది. యువరాజ్ క్షమాపణ కూడా చెప్పాడు. అయితే అతనిలో కుల అహంకారం ఉందని, అతనిపై చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల కార్యకర్త రజత్ కల్సాన్ హిస్సార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హరియాణా పోలీసులు కేసుపై విచారణ జరిపి, తగిన సాక్ష్యాలు ఉన్నాయంటూ కేసు నమోదు చారు. యువరాజ్‌కు నోటీసులు పంపామని, త్వరలోనే అతణ్ని విచారిస్తామని పోలీసులు చెప్పారు.