బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు

February 29, 2020

hdvbx

బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాపై అత్యాచారం కేసు నమోదు అయింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని భయాందర్ పట్టణానికి చెందిన మహిళా కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఇటీవల మహిళా కార్పొరేటర్‌తో కలిసి మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా ఉన్న అసభ్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. వీటిని చూసిన ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. తనను 1999 నుంచి లైంగికంగా వేధిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటానని లొంగదీసుకున్నాడని చెప్పింది.  ఆ తర్వాత వీడియోలు బయటపెడతానని బెదిరించినట్టు తెలిపింది. దీంతో పలు సెక్షన్లపై ఎమ్మెల్యేతో పాటు సంజయ్ తార్కర్ అనే మరో వ్యక్తిపైనా పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా మూడు రోజుల క్రితమే వీరు బీజేపీకి రాజీనామా చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

కాగా నరేంద్ర మెహతా వ్యాపారవేత్తగా పేరు సంపాధించుకున్నాడు. ఆ తర్వాత ఆయన 1997లో బీజేపీలో చేరి ముంబై మేయర్‌గా ఎన్నికయ్యారు. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. అవినీతి ఆరోపణలతో ఆయన్ను2002 అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత చాలా కాలానికి కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఓసారి తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చి అప్పట్లో వార్తల్లో నిలిచారు. తాజాగా అత్యాచార ఆరోపణలతో మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది.