టాలీవుడ్ నిర్మాత‌ కొడుకు, కూతురుపై కేసు - MicTv.in - Telugu News
mictv telugu

టాలీవుడ్ నిర్మాత‌ కొడుకు, కూతురుపై కేసు

October 1, 2020

POlice Case On Nattikumar Son

టాలీవుడ్‌  నిర్మాత నట్టి కుమార్‌ కొడుకు, కూతురుపై కేసు నమోదు అయింది. ఫ్రెండ్లీ మూవీస్ యజమాని నిర్మాత చంటి అడ్డాల బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సినిమాను మోసపూరితంగా వారి సినిమాగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.‘ఐనా ఇష్టం నువ్వు’  అనే సినిమాతో ఈ వివాదం మొదలైంది. 

చంటి అడ్డాల ‘ఐనా ఇష్టం నువ్వు’  అనే సినిమా తీసిన తర్వాత వాటి ప్రసార హక్కులును నట్టి క్రాంతి, లక్ష్మీ కరుణ కొనేందుకు ముందుకు వచ్చారు. దీనికి సంబంధించి రూ. 45 లక్షలు మూడు వాయిదాల్లో చెల్లించేందుకు ఒప్పందం కూడా చేసుకున్నారు. డబ్బుల వ్యవహారంలో విభేదాలు తలెత్తాయి. దీంతో సమయానికి ఇవ్వకపోవడంతో అగ్రిమెంట్‌ను చంటి క్యాన్సిల్ చేశాడు. అయినా కూడా సినిమా పోస్టర్ నిర్మాతలుగా పేరు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కాగా, ఈ సినిమాలో హీరో నవీన్, కీర్తి సురేష్, పోసాని, నాగబాబు సహా పలువురు ప్రముఖులు నటించారు.