బోలెరో బండిలో రూ. 10 లక్షల మద్యం.. బయటపడనిది ఎంతో!  - MicTv.in - Telugu News
mictv telugu

బోలెరో బండిలో రూ. 10 లక్షల మద్యం.. బయటపడనిది ఎంతో! 

May 8, 2020

Police Caught Illegal Liquor in Bolero

మద్యం షాపులు తెరుచుకోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా బొలెరో వాహనంలో భారీ మద్యాన్ని తరలిస్తూ పోలీసులు చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు రూ.9.50 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి,ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

లక్ష్మీదేవిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని దుబ్బతండాకు చెందిన భూక్య వెంకన్న పాల్వంచలోని శ్రీ వెంకటేశ్వర వైన్స్ నుంచి మద్యం తరలిస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు.వెంకన్న తన ఇంటి వద్ద బొలెరో వాహనంలో మద్యం కిందకు దించుతుండగా పట్టుకున్నారు. దాదాపు  97 కాటన్ల క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం దందా చేసేందుకు వీటిని తీసుకెళ్లినట్టుగా గుర్తించారు. మద్యం తరలించిన TS 28 T 4345 నంబరు గల బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.