విశాలమైన రోడ్లు. గంటకు 200 కిలోమీటర్లకుపైగా వేగంతో జెట్ స్పీడ్ లో దూసుకెళ్లే కారు. ఆ కారును అదే వేగంతో ఫాలో అయ్యే రెండు పోలీసు కార్లు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి విశ్వప్రయత్నాలు. గన్ తో కల్పులు. ఇదేదో సినిమాలోని సీన్ అనుకుంటే పొరపాటే. అమెరికాలోని లాస్ఏంజిల్స్లో చోటుచేసుకున్నరియల్ ఇన్సిడెంట్ ఇది . ఓ నిందితుడిని పట్టుకునేందకు అక్కడి పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. చివరకు తమ ప్రాణాలకు తెగించి మరీ అతడిని వెంటాడి పట్టుకుని తుక్కురేగొట్టారు. సినీపక్కీలో సాగిన ఈ కారు ఛేజింగ్ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
అమెరికాలోని లాస్ఏంజిల్స్ పోలీసులు ఓ నిందితుడిని పట్టుకునేందుకు పెద్ద సాహసమే చేశారు. అచ్చం సినిమాల్లో యాక్షన్ సీన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా వెంటాడి మరీ అతడిని పట్టుకున్నారు. ఆయుధాలు పట్టుకున్న ఓ వ్యక్తి కారును దొంగిలించి వెళ్తుండగా పోలీసులు అతడిని ఛేజ్ చేశారు. లాస్ ఏంజిల్స్ రోడ్లపైన మెరుపు వేగంతో తప్పించుకునేందకు ప్రయత్నించాడు ఆ నిందితుడు. కారును నడుపుతూనే తనను పట్టుకునేందుకు వస్తున్న పోలీసులపైన కాల్పులు జరిపాడు. ఈ ఛేసింగ్ కొన్ని గంటల పాటు సాగింది. గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈ ఛేజ్ సాగినట్లు అధికరులు వెల్లడించారు. చివరికి ఓ వాహనాన్ని ఢీకొట్టిన నిందితుడి కారు అదుపుతప్పి స్థంభాన్ని ఢీ కొట్టింది. అనంతరం కారు నుంచి దిగి నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు తమ కార్ల నుంచి దిగి దొంగను పట్టుకుని అరెస్ట్ చేశారు. సినీ స్టైల్లో సాగిన ఈ ఛేజింగ్ చూసి ప్రజలు అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.