Home > విద్య & ఉద్యోగాలు > సర్కార్ బడిలో సింహం పిల్లలు…!

సర్కార్ బడిలో సింహం పిల్లలు…!

ఏదో బీద బిక్కోల్లు,ప్రైవేటు ఇస్కూలల్ల వేల ఫీజులు కట్టలేనోళ‌్లు తప్ప..ఇయ్యాలరేపు ఎవ్వలన్న తమ పోరగాళ్లను సర్కార్ బడిలల్ల సద్విపిస్తున్రా.. అంతెందుకు సర్కార్ బడిల సద్వువుజెప్పే సార్లుగుడ ఆళ్ళ పిల్లల్ను ప్రైవేట్ ఇస్కూల్కే తోల్తరు,ఎందుకంటే ఆళ్లు జెప్పే పాఠాలు..సద్వులమీద ఆళ్లకు గంత నమ్మకమన్నట్టు,ఈళ్లే ఇట్ల జేస్తున్రంటే ఇగ బగ్గ పైసలున్నోళ్లు పెద్ద పెద్ద కొల్వులు జేశెటోళ్లు ఎమ్యేల్యేలు,పోలీసార్లు,మంత్రులు ఆళ్ల పిల్లల్ను సర్కార్ బడిలేస్తారు…ఏహె సర్కార్ బడిల సద్వే కర్మ మా పోరగాళ్లకేంది అని అంటరు,అగో గంత అద్మానం జేశిన్రు సర్కార్ బడిల పరిస్థితి.ఇగ శానమంది తల్లి దండ్రులు గుడ అప్పో సొప్పో జేశి ఆళ్ల పోరగాన్లను ప్రైవేట్ బడిలల్లకే తోల్తరు, సర్కార్ బడికొయ్యి తమ పోరగాన్లు అమ్మ నాయ్న అనుడుకన్నా…ప్రైవేట్ ఇస్కూళ్లకొయ్యి మమ్మీ డాడీ అంటేనే మస్తు మందికి సంబరం.కాలం అట్లైపోయింది ఏం జేస్తం.

నాలుగో సింహం పిల్లలు సర్కార్ బడిలో…

కనీ గీడ జిల్లాకే పెద్ద అయిన ఓ పోలీస్ సార్ ఉన్న ట్రెండ్ ను ఫాలో అవ్వకుంట కొత్ర ట్రెండుకు శ్రీకారం సుట్టిండు,సర్కార్ బడి ఐతేంది సద్వురాద, శెప్పెటోళ‌్లు మంచిగ శెప్తే ఏ బడైన సద్వస్తది…అని ఆళ్ల ఇద్దరు పిల్లల్ను సర్కారు బడిల జాయిన్ జేశిండు,అంతేగాదు ఓ పోస్టర్ గొట్టి అందరికి సందేశం గుడిచ్చిండు, ఒక జిల్లా పోలీస్ ఆపీసర్నై ఉండి నా బిడ్డలను సర్కార్ ఇస్కూళ్ల జాయిన్ జేశ్న ఎందుకంటే…దానికి దీనికనీ ప్రైవేట్ ఇస్కూళ‌్లలెక్క వేల ఫీజులు గుంజుడుండది,గవర్నమెంట్ కొల్వు కావాలని ఎంతో కష్టపడి సద్వి టీచర్ జాబ్ సంపాయించిన టీచర్లు పాఠాలు జెప్తరు, ర్యాంకుల కోసమని ఇస్కూల్ పేరు కోసమని ప్రైవేట్ ఇస్కూళ్లు పోరగాండ్లకు వెట్టినట్టు ఒత్తిడి అసలే ఉండది,పచ్చని శెట్లు ప్రశాంత వాతావరణంల పాఠాలు జెప్తరు,మారుతున్న కాలాన్ని బట్టి సద్వును తెలుగులోనే గాదు ఇంగ్లీష్లగుడ జెప్తున్రు..గిన్ని సౌలతులున్నంక సర్కార్ బడిని కాదని ప్రైవేట్ ఇస్కూళ్లకు మన పోరగాండ్లను ఎందుకు తోలాలే ఓ పారి అందరు ఆలోశన జెయ్యున్రి అని శెప్పుకచ్చిండు….వారెవ్వ సారుకు శేతిగుంజినాగుడ ఎన్ని సెల్యూట్ జేశిన తక్కోనే…ఇంతకీ ఇదేడంటే పక్కరాష్ట్రం ఆంద్రప్రదేశ్ కడప జిల్లాలున్న ఆలంఖాన్ పల్లి అనే ఊర్లె….సారు పేరు ఏనుగుల చైతన్యమురళి..డిప్యూటీ కమీషన్ ఆఫ్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్.కనీ ఈ సార్ను ఆదర్శంగ తీస్కొని పెద్ద పెద్ద గవర్నమెంట్ కొల్వులు జేస్తున్న సార్లుగుడ తమ పోరగాళ్లను సర్కార్ బడిలల్ల తోలెనంటే నా సామిరంగ సద్వంటే సర్కార్ బడే అని అందరు అన్కునెతట్టైతది,సద్వు శారెడు బలపాలు దోశెడన్నట్టు,సద్వుజెప్పుడు తక్కువ… పైసలు గుంజుడెక్కో జేశే ఈ ప్రైవేటు ఇస్కులోళ్లు తిక్కగుడ కుదుర్తది.

Updated : 29 Jun 2017 2:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top