చెప్పులు పోయాయని పొరుగింటోళ్లపై పోలీసులకు ఫిర్యాదు  - MicTv.in - Telugu News
mictv telugu

చెప్పులు పోయాయని పొరుగింటోళ్లపై పోలీసులకు ఫిర్యాదు 

November 18, 2019

Police complaint on footware theft 

తమ ఇంటి ముందు వదిలేసిన చెప్పులు, బూట్లు పోయాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. మొదట్లో ఆశ్చర్యపోయిన పోలీసులు తర్వాత కేసు పెద్దదే అని దర్యాప్తు ప్రారంభించారు. 

చెన్నైలోని కిల్పాక్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ హఫీజ్.. సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు చేశారు. రూ. 76 వేల ఖరీదైన 10 జతలు పోయాయని తెలిపాడు. మెయిన్ గేటుకు తాళం వేసి ఉన్నా ఎత్తుకపోయారని, ఆ సమయంలో తాము ఇంట్లోనే ఉన్నామని వివరించాడు. తమ పొరుగింట్లోని యువకులపై తనకు అనుమానంగా ఉందని, వారి పనిమనిషి ఈ పని చేసి ఉంటుందని చెప్పాడు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితులను ప్రశ్నించనున్నారు.