దుబ్బాక ఉపపోరు.. టీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు - MicTv.in - Telugu News
mictv telugu

దుబ్బాక ఉపపోరు.. టీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు

October 31, 2020

police conducted searches houses of trs leaders

తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికకు సమయం దగ్గరపడింది. నవంబర్ 3న పోలింగ్ జరుగనుంది. దీంతో పోలీసులు దుబ్బాకతో పాటు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో ఎనిమిది మంది ఇళ్లలో తనిఖీలు చేశారు. 

దుబ్బాక జెడ్పిటీసీ రవీందర్ రెడ్డి, దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ, ఎంపీపీ పుష్పలతరెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చింత రాజు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సిద్దిపేట టౌన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి ఇండ్లలో సోదాలు నిర్వహించారు.