గన్నవరం రాజకీయం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డే వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల టీడీపీ ఆఫీస్‌పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేయడమే ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులకు కారణం. ఆదివారం టీడీపీ పార్టీ ఆఫీస్‌పై వల్లభనేని వంశీ అనుచరులు దాడికి దిగారు. ఆఫీస్‌లో సామాగ్రిని ధ్వంసం చేశారు. బయట ఉన్న కార్లకు నిప్పు పెట్టి నానా హంగామా సృష్టించారు. దీనిని సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటితో పాటు మరో వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. దాడి జరుగుతున్న సమయంలో ఓ కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శించిన దృశ్యాలు బయటపడ్డాయి.
Gannavaram TDP party office lo godava jaruguthunte ee police uncle matram party office lo vunna earbuds lepesthunaadu hie ga🤣🤣🤣 pic.twitter.com/eF0YuCUNAn
— Lɪᴋʜɪᴛᴇsʜ Cʜᴏᴡᴅᴀʀʏ ☄ʸᵘᵛᵃᶢᵃˡᵃᵐ (@LikhiteshChow) February 21, 2023
ఒక వైపు టీడీపీ ఆఫీస్‌పై భీకరమైన దాడి. పరిస్థితులు అదుపుతప్పాయి. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా తరలివచ్చారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓ కానిస్టేబుల్ మాత్రం ఎంచాక్క టీడీపీ ఆఫీస్‌లోకి పోయి విలువైన వస్తువుల కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఇయర్ బర్డ్స్ దర్శనమిచ్చాయి. వెంటనే వాటిని తీసి జేబులోకి వేసి..ఏం తెలియనట్టు నటించాడు. తర్వాత అక్కడికి వచ్చిన వారిని ఇతర సిబ్బందితో కలిసి పంపిచే ప్రయత్నం చేస్తూ విధుల్లో కలిసిపోయాడు. ఈ కానిస్టేబుల్ నిర్వాకం సీసీకెమెరాలో రికార్డు కావడంతో అడ్డంగా దొరికిపోయాడు. టీడీపీ నేతలు వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.