హైదరాబాద్ జంట నగ్న శవాలు.. భర్తే సూత్రధారి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ జంట నగ్న శవాలు.. భర్తే సూత్రధారి

May 4, 2022

నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడెం బ్రిడ్జి వద్ద సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులతో పాటు అందరూ ఊహించినట్టుగానే హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తేలింది. నిందితుడు జ్యోతి భర్త శ్రీనివాసరావు అని పోలీసులు తేల్చేశారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన జ్యోతి స్థానికంగా ఉండే క్యాబ్ డ్రైవరుతో వివాహేతర సంబంధం పెట్టుకోగా, అది తెలిసిన భర్త, మరో నలుగురితో కలిసి ఈ హత్యలకు పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో శ్రీనివాసరావుతో పాటు సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే క్యాబ్ డ్రైవర్ యశ్వంత్‌కు జ్యోతితో పరిచయముందనే విషయం తమకు తెలియదని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాగా, జ్యోతి, యశ్వంత్‌లను బండరాయితో కొట్టి చంపేసి, నగ్నంగా వదిలేసిన విషయం తెలిసిందే.