పోలీసులతో జాగిలాలు పెద్ద నేరస్తులను పట్టుకోవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో వాటికి పోలీసులతో పాటు సమానంగా మర్యాద ఇస్తారు. వాటికీ కూడా పదవి విరమణ ఉంటుంది. పదవి విరమణ పొందిన జాగిలాన్ని పెంచుకోవడానికి ఎందరో పోటీ పడతారు. అదే విధి నిర్వహణలో ఏదైనా జాగిలం మరణిస్తే దానికి పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తారు.
ఇటీవల తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న జాగిలం చనిపోయింది. దానికి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ జాగిలం ఎన్నో కేసుల్లో నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులకు సహాయకారిగా నిలిచింది. ప్రాణాపాయ పరిస్థితుల్లో వాసనలు పసిగట్టి పోలీసులకు రక్షణగా నిలిచింది. ఈమధ్య అనారోగ్యం కారణంగా ప్రాణాలు విడిచింది. దాని సేవలని గుర్తుచేసుకుంటూ పోలీసులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.