రౌడీ పోలీసులు..వీళ్లా రక్షకులు..? - MicTv.in - Telugu News
mictv telugu

రౌడీ పోలీసులు..వీళ్లా రక్షకులు..?

June 10, 2017

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు బరితెగించారు. రౌడీల్లా మారారు. పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే తన్నుకున్నారు. ఇంతకీ ఎందుకు కొట్టుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

పోలీసోడు ఎక్కడైనా పోలీసోడే. డ్రెస్ లో ఉన్నాడంటే నాలుగో సింహం..మంచికేమోగానీ చెడుకైతే ఇది పక్కా సూటబుల్. జనానికే రూల్స్.. తాము మాత్రం డోంట్ కేర్.ఎక్కడైనా ఎవరైనా వారికి అడ్డం పడితే రూల్స్ బ్రేకే.. ఆపింది అడ్డుకున్నది డిపార్ట్ మెంటోడైనా అంతే. రూల్ ఈజ్ రూల్.. అంటే రౌడీల్లా.. రెచ్చిపోతారు. కర్నూల్ లో ఇలాగే జరిగింది. నడిరోడ్డుపై కొట్టుకున్నారు.

రాజ్‌ వివార్‌ కూడలి దగ్గరకు స్పెషల్‌ పార్టీ కానిస్టేబుళ్లు ద్విచక్రవాహనంపై వచ్చారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారని అక్కడ పనిచేస్తున్న ట్రాఫిక్‌ హోంగార్డు హుస్సేన్‌ వారి వాహనాన్ని ఆపాడు. వాహనం తాళాలు లాక్కొనేందుకు హోంగార్డు యత్నించాడు. దీంతో రెచ్చిపోయిన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ అతనిపై దాడికి దిగారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అందరి ముందే ఇలా పోలీసులు కొట్టుకోవడంపై స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

అదే మామూలు జనాలైతే ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తారు. ముక్కు పిండి చలానా వసూలు చేస్తారు. మరి పోలీసులపై ఏ కేసులు పెడతారో చూడాలి