నిబంధనలు పాటించని వాళ్లు ఎంతటి వారలైనా పోలీసులు విడిచిపెట్టడం లేదు. నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. కార్లకు బ్లాక్ ఫిల్మ్ ఉండకూడదనే సుప్రీం కోర్టు మార్గదర్శకాలతో హైదరాబాదులో ప్రముఖుల కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్, నాగ చైతన్య, త్రివిక్రమ్‌ల కార్లకు బ్లాక్ ఫిల్మ్ తీసేసి జరిమానా కూడా విధించారు. తాజాగా జూబ్లీహిల్స్‌లో బాహుబలి ప్రభాస్ కారును ఆపిన పోలీసులు రూ. 1450 జరిమానా విధించారు. బ్లాక్ ఫిల్మ్ తొలగించారు. ఎంపీ అని ఉన్న స్టిక్కర్, నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడంతో జరిమానా విధించినట్టు తెలిపారు. కాగా, ఈ సమయంలో కారులో ప్రభాస్ లేనట్టు తెలిసింది.