హింసిస్తూ జనగణమన పాడించిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

హింసిస్తూ జనగణమన పాడించిన పోలీసులు

February 29, 2020

 

Police forced

సినిమా హాళ్లలో జనగణమన రికార్డు వేసే సమయంలో అందరూ కచ్చితంగా నిలబడాలని అమధ్య కేంద్రం ఆదేశాలు తీసుకువాడం, దీనిపై సుప్రీం కోర్టు ఆక్షేపణ తెలపడం తెలిసిందే. దీనిపై వివాదం సాగుతుండగానే పోలీసులు అత్యుత్సాహంతో జాతీయగీతం మళ్లీ వార్తల్లోకెక్కింది. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణల్లో చితికిపోయిన ఈశాన్య ఢిల్లీలో కొందరు పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఘర్షణల్లో గాయపడిన యువకులను హింసిస్తూ వారితో బలవంతంగా జాతీయ గీతాన్ని పాడించారు. ఘర్షణ మృతుల్లో ఒకరైన పైజాన్(23) అనే యువకుడు కూడా ఈ బాధితుల్లో ఉండడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అతణ్ని పోలీసులు ఒక రోజుపాటు అక్రమ నిర్బంధంలో ఉంచినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.