Police get custody of suspects in MLA poaching case
mictv telugu

కస్టడీలోకి నిందితులు..ఫామ్‌హౌస్ కేసు మలుపు తిరుగుతుందా?

November 10, 2022

ఫామ్‌హౌస్ నిందితులు నోరు విప్పుతారా? కస్టడీలో అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తారా? ఫామ్‌హౌస్ ఫైల్స్ గుట్టుని విప్పుతారా?అసలు నిజాలేంటో నిగ్గు తేలుస్తారా?పోలీస్ కస్టడీలో ఏం జరగబోతోంది? పోలీసులు వారిని ఏం అడుగబోతున్నారు. ఫామ్‌హౌస్ కేసులో చిక్కుముడులు విప్పుతారా?ప్రధాని తెలంగాణ టూర్‌కు ముందు సంచలనాలు బయటపడుతాయా?

కస్టడీలో నిగ్గుతేలుస్తారా?
ఫామ్‌హౌస్ కేసులో నిందితులైన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.చంచల్ గూడ జైలు నుంచి మొయినాబాద్‌కు తరలించారు .బ్లాక్ ఫిల్మ్ ఉన్న ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు. వీరిని మొయినాబాద్‌లో పోలీస్ స్టేషన్‌లో విచారిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలదాకా విచారణ జరుగుతోంది. న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది.

ప్రశ్నలు-జవాబులు

ఫామ్‌హౌస్ కేసులో నిజాల్ని పోలీసులు నిగ్గు తేలుస్తారా? వీడియోల్లో ఉన్న సమాచారాన్ని మించి రాబడుతారా?అసలు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం వెనక ఏం జరిగిందో పోలీసులు తేలుస్తారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరి మదిని తొలుస్తున్నాయి. నిందితులు ఏం చెప్పబోతున్నారు?డీల్ వెనుక ఉన్న అసలు నిజాల్ని బయటపెడుతారా? . ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు మరిన్ని సేకరిస్తారా? అనేది ఆసక్తిగా మారింది

వీడియోల్లో ఎవరు ఏమన్నారంటే

ఎమ్మెల్యే ఎర కేసులో మూడు గంటల నిడివి ఉన్న వీడియాలు ఉన్నాయి. ఇందులో 70 నిమిషాల ఉన్న వీడియోను సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌లో చూపించారు. ఆ తర్వాత సుప్రీం, సీబీఐ, ఈడీ,అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపారు. టీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు, రోహిత్ రెడ్డి, గువ్వలబాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్దన్ రెడ్డితో నిందితులు జరిపిన బేరసారాలు ఉన్నాయి. అసలు ఎవరేం మాట్లాడారో చూద్దాం..

సింహయాజి
“ఫోన్ చేసి గ్యారెంట్ ఏంటి అని అడిగారు.కన్ఫామ్ చేసుకున్నాక డీల్ చేయాలని చెప్పా. అక్కడ అంతా ఆయన క్యాండెట్లే ఉన్నారు. అవును ఆయన ఒప్పుకోకపోతే అంతే. వింటే ఓకే లేదంటే ఈడీ,సీబీఐలే”

నందకుమార్
“నాకు ఈ పార్టీతో సంబంధం లేదు.కానీ నేను అవతలివారికి ఎలా చెప్పాలి..ఒక్కొక్కరు రూ.100 అడుగుతున్నారు.
మొత్తం నలుగురు సిద్ధంగా ఉన్నారు.వీళ్లు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతారు.

రామచంద్రభారతి
పేమెంట్ విషయంలో ఇబ్బంది ఉండదు. ఫిగర్ క్లియర్ .టూ.టూ..ఫైవ్ . ముందుగానే అన్నీ ఓకే అయిపోయాయి నా దగ్గరికి ముగ్గురు పేర్లు వచ్చాయి.వాళ్లకు కండీషన్లు ఉన్నాయి.మునుగోడుకు ముందే కంప్లీట్ కావాలి.”

కస్టడీలో ఇంతకుమించి…

పోలీస్ కస్టడీలో ఇంతకుమించి నిందితులు ఏం చెబుతారన్నది ఉత్కంఠ రేపుతోంది. “ఇక్కడకు ఎలా వచ్చింది?డీల్ వెనుక ఉన్నదెవరు?నెంబర్ 1, 2లు ఎవరు? ఢిల్లీ పెద్దలతో ఉన్న లింకులు ఏంటి? అనేది నిందితులు కస్టడీలో చెబితేనే ఫామ్ హౌజ్ కేసులో నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంది.