వీడియో : బాత్రూంలో బ్రోతల్ హౌస్.. పోలీసుల షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : బాత్రూంలో బ్రోతల్ హౌస్.. పోలీసుల షాక్

May 11, 2022

వ్యభిచార ముఠా నిర్వాహకులు రోజురోజుకీ తెలివిమీరుతున్నారు. పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదని రోజుకో కొత్త రకం ప్రయోగాలు చేస్తున్నారు. అయినా చివరికి పోలీసులకు చిక్కడం తప్పడం లేదు. తాజాగా కర్ణాటకలో జరిగిన ఘటన పై విషయాన్ని సూచిస్తుంది. చిత్రదుర్గలోని ఓ హోటల్లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో పోలీసులు హోటల్లో సోదాలు నిర్వహించారు. అన్ని గదులు వెతికినా వారికి ఎలాంటి క్లూ లభించలేదు. చివరికి విశ్వసనీయ సమాచారం ప్రకారం బాత్రూమును పరిశీలించగా గురక శబ్డం వినిపించింది. కాసేపటి తర్వాత ఆ గురక బాత్రూం గోడల నుంచి వస్తుందని పోలీసులు గ్రహించారు. గోడపై ఓ ప్రదేశంలో గట్టిగా నొక్కగా తలుపు తెరుచుకున్నట్టు గోడ తెరచుకుంది. తరచి చూడగా, ఓ గది బయటపడింది. అందులోంచి ఓ యువతి, ఓ కస్టమరు బయటకు వచ్చారు. ఇలా మరికొన్ని బాత్రూంలు చూడగా, మొత్తానికి మూడు గదులు, ఓ సెల్లార్ బయటపడింది. దీంతో పోలీసులు షాకయ్యారు. చూడ్డానికి బాత్రూంలా ఉండగా, లోపల ఇంత పెద్ద సెట్టింగ్స్ ఉన్నయా? అని ఆశ్చర్యపోయారు.