భార్య మటన్ వండలేదని ఫిర్యాదు.. భర్త మీదే కేసు పెట్టిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

భార్య మటన్ వండలేదని ఫిర్యాదు.. భర్త మీదే కేసు పెట్టిన పోలీసులు

March 21, 2022

chiken

తాగిన మత్తులో భార్య మటన్ వండలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడో భర్త. నచ్చజెబుదామని అతడి ఇంటికెళ్లిన పోలీసులు అతడి పిరిస్థితి చూసి షాకయ్యారు. తిరిగి అతడిమీదే కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి హోళీ పండుగ రోజు ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికెళ్లాడు. మటన్ కూర భార్యకు ఇచ్చి వండమని ఆదేశించాడు. భార్య నిరాకరించడంతో కోపంతో 100 కు ఫోన్ చేసి మటన్ వండని భార్య మీద కేసు పెట్టాలని డిమాండ్ చేశాడు. పోలీసులు మొదట్లో పట్టించుకోలేదు. కానీ వరుసగా ఆరు సార్లు ఫోన్ చేసి విసిగించడంతో అతడి ఇంటికెళ్లిన పోలీసులకు మద్యం మత్తులో ఉన్న నవీన్‌ను చూసి, ఏం జరిగిందని భార్యను అడిగి వివరాలు తీసుకున్నారు. అనంతరం పోలీసులను ఇబ్బంది పెట్టినందుకు నవీన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా, ఎంతోమంది ఆపత్కాలంలో 100కు ఫోన్ చేస్తుంటారనీ, చిన్న విషయాలకు పోలీసులను విసిగించినందుకు అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.