Home > Featured > పుణ్యానికి పోయిన పోలీసులపై భీకర దాడి..(వీడియో)

పుణ్యానికి పోయిన పోలీసులపై భీకర దాడి..(వీడియో)

Police health staff attacked

మంచికి పోతే చెడు ఎదురవుతోంది. ప్రాణాలను కాపాడ్డానికి వెళ్తున్న వైద్యులు, పోలీసులపై మూర్ఖజనం దాడులకు తెగబడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కోవిడ్ విధుల్లో ఉన్న పోలీసులపై అల్లరిమూకలు బరితెగించి దాడులకు దిగాయి. పెద్దగా అరుస్తూ, రాళ్లు రువ్వుతూ భయాందోళన సృష్టించారు.

నాలా రోడ్డులోని బంజారా ప్రాంతంలో కరోనా కేసులో ఎక్కువగా ఉన్నాయి. ఓ కరోనా రోగితో సన్నిహితంగా మెలగిన 9మంది బంధువులను ఆస్పత్రికి తరలించడానికి పోలీసులు, ఆరోగ్య సిబ్బంది అక్కడికి వెళ్లారు. అయితే దీన్ని అవమానంగా భావించిన స్థానిక ముస్లింలు దాడికి తెగబడ్డారు. పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరుకుని రాళ్లు విసురుతూ తరిమేశారు. సందుగొందుల్లోని బర్రెలు, కుక్కలు కూడా ప్రాణభయంతో పారిపోయాయి. ఈ సంఘటనపై సీఎం ఆదిత్యానాథ్ తీవ్రంగా స్పందించారు. నిందితులపై గూండా, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. ఐదుగురిపై కేసులు పెట్టి , పది మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. వైద్యసిబ్బందిపై దాడి చేసే ఏడేళ్ల జైలు శిక్ష పడేలా కేంద్రం ఆర్డినెన్సు తెచ్చినా ఫలితం లేకుండా పోతోంది.

Updated : 30 April 2020 1:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top