ఇదో వింత అలవాటు..కప్పులో టీ తాగుతున్న గుర్రం - MicTv.in - Telugu News
mictv telugu

ఇదో వింత అలవాటు..కప్పులో టీ తాగుతున్న గుర్రం

December 2, 2019

ఉదయం లేవగానే.. కప్పు టీ తాగనిదే చాలా మందికి రోజు మొదలు కాదు. పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు దీన్ని ఈ అలవాటు చేసుకున్న వారు ఉన్నారు. కానీ ఇది కేవలం మనుషులకు మాత్రమే పరిమితమా.? మాకెందుకు ఉండకూడదు.. అనుకుంది ఓ గుర్రం. ప్రతి రోజు ఉదయాన్నే టీ తాగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. లేవగానే టీ తాగిన తర్వాతే అది పైకి లేచి మిగితా పనులు పూర్తి చేసుకుంటుంది. 15 ఏళ్లుగా ఇలా టీ తాగుతున్న గుర్రం విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. 

బ్రిటన్‌లోని మెర్సీసైడ్ పోలీసుల వద్ద ఉండే జాక్ అనే గుర్రం ఇలా ప్రతి రోజూ టీ తాగుతుంది. ఓ కప్పులో టీ ఇవ్వగానే గబగబా జుర్రేస్తోంది. దీనికి ఇలా టీ అలవాటు కావడానికి పెద్ద కారణమే ఉంది. 15 ఏళ్ల  క్రితం తన రైడర్ టీ తాగి కొంత మిగిలి ఉండగానే దాన్ని గుర్రం పక్కన పెట్టాడు. ఆ వెంటనే అది దాంట్లో నాలుక పెట్టి తాగేసింది. అప్పటి నుంచి టీ కప్పు కనిపించిన వెంటనే తాగడం చూశారు. దీంతో అది టీ తాగడానికి అలవాటు పడిందని గుర్తించి అప్పుటి నుంచి దానికి కప్పులో టీ అందిస్తున్నారు. టీ తాగిన వెంటనే ఎంతో ఉత్సాహంగా  గుర్రం పరుగులు పెట్టడం విశేషం.