police implementing money lenders act on loan app organizers
mictv telugu

ఇక లోన్ యాప్ నిర్వాహకుల ఆట కట్టు.. అమల్లోకి ‘మనీ లెండర్స్’ యాక్ట్

September 2, 2022

ఈజీగా లోన్ ఇస్తామంటూ అమాయకులను ఆకర్షించి డబ్బులు ఇస్తున్న లోన్ యాప్‌ నిర్వాహకులు.. వసూళ్ల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక కొంతమంది ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా రుణ యాప్‌ నిర్వాహాకులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తీసుకున్న లోన్ చెల్లించిన‌ప్ప‌టికి ఇంకా లోన్ క‌ట్టాల‌ని బాధితుల‌ను బెధిరించి డ‌బ్బులు వ‌సూళు చేస్తున్నారు కేటుగాళ్లు. అయితే ఈ లోన్ యాప్ ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానికి పోలీసులు నిజాం కాలంలో ఉప‌యోగించిన చ‌ట్టాన్ని ప్రయోగించడానికి రెడీ అవుతున్నారు. అదే మనీ లెండర్స్ యాక్ట్.

మొదట నిజాంల పాలనలో రూపొందించబడిన ఈ చట్టం, తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వంతో ఆమోదించబడింది. మనీ లెండర్స్ యాక్ట్‌ను రాష్ట్రాలు కూడా కాబూలీవాలాలకు వ్యతిరేకంగా ఉపయోగించాయి. వారు ప్రధానంగా అధిక వడ్డీ వసూలు చేసిన పలువురు పహెల్వాన్‌లపై అప్ప‌ట్లో ఓల్డ్ సిటీలో మనీ లెండర్స్ యాక్ట్‌ను ఉపయోగించేవారిని చ‌రిత్ర చెబుతుంది.

ఈ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం, ప్రభుత్వం నుంచి లైసెన్స్ లేకుండా ఏ వ్యక్తి మనీ లెండింగ్ వ్యాపారం చేయకూడదు. ఇది ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానాతో కూడిన నేరం. ఇప్పుడు ఇదే చ‌ట్టాన్ని రుణ యాప్‌ కంపెనీలపై ప్రయోగిస్తున్నారు పోలీసులు. సైబరాబాద్‌ పోలీసులు ఐటీ చట్టం, క్రిమినల్‌ బెదిరింపు, మనీ లెండర్స్‌ యాక్ట్‌తో పాటు లోన్‌ యాప్స్‌పై మహిళలను కించ‌ప‌రిచే విధంగా వ్య‌వ‌హారించ‌డం వంటి నేరాల‌కు ఈ చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేయవచ్చు అంటున్నారు అధికారులు. అనుమతిలేని రుణ యాప్లను ప్లే స్టోర్ నుంచి తొలగించాల్సిందిగా గూగుల్ ప్రతినిధులకు సైబర్ క్రైం పోలీసులు గతంలో లేఖ రాశారు. కానీ ఆశించిన స్పందన రావడం లేదని పోలీసులు చెబుతున్నారు. సులభంగా రుణాలు ఇస్తామనే సంస్థలను నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రుణ యాప్ సంస్థలు అధిక వడ్డీ కోసం వేధిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.