మహిళా ఎస్ఐ అత్యుత్సాహం.. తీవ్రగాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా ఎస్ఐ అత్యుత్సాహం.. తీవ్రగాయాలు

November 19, 2019

ఆమె ఎస్ఐ. ప్రభుత్వం కేటాయించిన డ్రైవర్ ఉన్నాడు. కానీ సొంతంగా జీపు నడిపి ప్రమాదానికి గురయ్యారు. డ్రైవింగ్‌పై అంతంగా పట్టులేకపోవడంతో అదుపుతప్పి వాహనాన్ని షాపు మీదికి తీసుకెళ్లిన ఆమె తర్వాత కంగారులో బండిని అదుపు చేయలేక మరో ప్రమాదానికి కారకురాలైంది. 

Police inspector.

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎస్ఐ నీలిమ ఒంగోలులో గత రాత్రి తనిఖీలు నిర్వహించారు. డ్రైవర్ ఉన్నా తానే అత్యుత్సాహంతో జీపు నడిపారు. కర్నూల్ బైపాస్ రోడ్డులో వెళ్తుండగా జీపు అదుపు తప్పింది. ఓ షాపును ఢీకొట్టింది. దీంతో ఆమె వెంటనే అతివేగంతో జీపును వెనక్కి తీసుకొచ్చింది. అదే సమయంలో ముందు నుంచి ఓ లారీ వేగంగా వచ్చింది. నీలిమ అదుపు చేయలేకపోవడంతో లారీ జీపును ఢీకొట్టింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.