ఉగ్రదాడిలో పోలీసు ఇన్‌స్పెక్టరు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఉగ్రదాడిలో పోలీసు ఇన్‌స్పెక్టరు మృతి

October 20, 2020

bnnf

జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. ఇంటలిజెన్స్ అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు భద్రతా దళాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎదురుపడిన ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారు. కొందరు ఉగ్రవాదులు లొంగిపోతున్నారు. అయితే కొన్ని సార్లు ఉగ్రవాదులు జరుపుతున్న దాడుల్లో భద్రతా దళాలు, పోలీసులు అమరులవుతున్నారు.

తాజాగా అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు ఇన్‌స్పెక్టరు అమరుడయ్యాడు. అనంత్ నాగ్‌లో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా వారు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జమ్మూకశ్మీరు విభాగానికి చెందిన పోలీసు ఇన్‌స్పెక్టరు ముహమ్మద్ అష్రఫ్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు.