బాగా తాగి ఉన్నాం సార్..ఏం తెలియలేదు :దిశ కేసు నిందితులు - MicTv.in - Telugu News
mictv telugu

బాగా తాగి ఉన్నాం సార్..ఏం తెలియలేదు :దిశ కేసు నిందితులు

December 2, 2019

అత్యంత పాశవికంగా కామాందుల చేతిలో బలి అయిన దిశ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమెకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ సమయంలో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు వారు చేసిన నేరంపై ఆరా తీశారు. తాము బాగా మద్యం తాగి మత్తులో ఉన్నామని అప్పుడు ఏం చేస్తున్నామో సోయిలేని స్థితిలో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వెల్లడించారు. వారు చెప్పే మాటలకు పోలీసులే నిర్ఘాంత పోయారు.

Police Interrogation.

‘తాము లారీలోడుతో వచ్చిన తర్వాత తొండుపల్లి వద్ద ఆగాం. ఉదయం నుంచి ఖాళీగా కూర్చోవడంతో విసుగొచ్చింది. ఏదో ఒకటి చేయాలని అనుకొని ఫుల్‌గా మద్యం సేవించాం. అదే సమయంలో దిశ అటుగా వచ్చి బైక్ పార్క్ చేయడం చూశాం. ఆమె తిరిగిరాగానే అత్యాచారం చేయాలని అనుకొని ప్లాన్ వేసుకున్నాం.ఎంత ఆలస్యంగా వస్తే అంతా సులభంగా తమ పని పూర్తి అవుతుందని భావించాం. ఆమెను కాల్చివేస్తే ఎవరికి తెలియదని అనుకున్నాం. కానీ ఇంత దూరం వస్తుందని మేం ఊహించలేదు. బాగా తాగిన మత్తులో తప్పు చేస్తున్నామనే భావన కలగలేదు’ అంటూ నిందితులు చెప్పుకొచ్చారు. కాగా ఈ కేసుపై ఇంకా పూర్తి విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు. నిందితులను తమ కస్టడీ కోసం కోర్టును కోరే అవకాశం ఉంది.