Police issued notices to MLA Rajasingh
mictv telugu

రాజాసింగ్‌కు నోటీసులు.. ఈ సారి చట్టప్రకారం అరెస్ట్ చేసే అవకాశం

August 25, 2022

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం రెండు మూడు రోజులుగా తెలంగాణలో హల్‌చల్ చేస్తోంది. ఓ వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా, అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే నిబంధనల ప్రకారం అరెస్ట్ చేయలేదని గుర్తించిన న్యాయమూర్తి పోలీసులను మందలిస్తూ వెంటనే రాజాసింగ్‌ను వదిలేయాలని ఆదేశించింది. దీంతో పాతబస్తీలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ సారి ఏమాత్రం పొరపాటుకు అవకాశం లేకుండా అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో రాజాసింగ్‌కి నోటీసులిచ్చారు. అయితే గతంలో మాదిరి కాకుండా ఈ సారి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. దీంతో మరోసారి రాజాసింగ్ అరెస్ట్ తప్పదనే పరిస్థితి నెలకొనగా, రాజాసింగ్ మాత్రం అరెస్ట్‌, రిమాండ్‌ను తప్పించేందుకు లాయర్లతో తన నివాసంలో చర్చలు జరుపుతున్నారు. దీంతో ఏం జరుగనుందనే ఆసక్తి నగర ప్రజల్లో నెలకొంది.