భద్రాద్రి కూంబింగ్.. మిస్ ఫైర్‌తో ఆర్ఎస్ఐ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

భద్రాద్రి కూంబింగ్.. మిస్ ఫైర్‌తో ఆర్ఎస్ఐ మృతి

September 16, 2020

bgf

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం అటవీ ప్రాంతం చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు చేతిలోని తుపాకి పేలి పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తునగా ఈ ఘటన జరిగింది. గత కొన్ని రోజులుగా చెన్నాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల అలజడి ఎక్కువైంది. దీంతో పోలీసులు వరుసగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 

ఈ క్రమంలో ఓ పోలీస్ బృందం ఈరోజు ఉదయం చెన్నాపురం సమీపంలో కూంబింగ్ జరపడానికి వెళ్ళింది. ఈ సమయంలో ఆర్ఎస్ఐ ఆదిత్య సాయికుమార్ చేతిలో ఉన్న తుపాకి ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో ఆదిత్య అక్కడికి అక్కడే మరణించాడు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించాడు. ఆదిత్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. దీంతో ఆదిత్య స్వగ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి.