హీరో కమల్‌ హాసన్‌కు పోలీసు నోటీసులు..విచారణకు రావాలని  - MicTv.in - Telugu News
mictv telugu

హీరో కమల్‌ హాసన్‌కు పోలీసు నోటీసులు..విచారణకు రావాలని 

February 21, 2020

Police Notice Kamal Haasan Crane Incident Issue

ప్రముఖ సీనియర్ హీరో కమల్‌ హాసన్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. భారతీయుడు-2 చిత్రం షూటింగ్ లో జరిగిన ప్రమాదంపై విచారణకు రావాలని సూచించారు. ఆయనతో పాటు దర్శకుడు శంకర్‌, క్రేన్ ఆపరేటర్లకు కూడా నోటీసులు పంపించారు పోలీసులు. వీరంతా 25వ తేదీలోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.

భారతీయుడు -2 సినిమాలో షూటింగ్‌లో బుధవారం ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ ఒక్కసారిగా విరిగిపడటంతో ముగ్గురు మరణించారు. 10 మందికి గాయాలయ్యాయి. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 4 సెక్షన్లు జోడించి విచారణకు రావాలని సూచించారు. దీనిపై సినిమా బృందం స్పందించాల్సి ఉంది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం కూడా ప్రకటించారు హీరో కమల్ హాసన్