రాజ్‌తరుణ్‌కు నోటీసులు.. స్టేట్మెంట్ రికార్డ్    - MicTv.in - Telugu News
mictv telugu

రాజ్‌తరుణ్‌కు నోటీసులు.. స్టేట్మెంట్ రికార్డ్   

August 23, 2019

Police Notice To Raj Tarun

పలు కీలక మలుపుల నడుమ హీరో రాజ్ తరణ్‌పై  పోలీసులు కేసు నమోదు చేశారు. నార్సింగి అల్కాపూర్ వద్ద కారు యాక్సిడెంట్ చేసిన అతనికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. 279,336 సెక్షన్లలో కేసు నమోదు చేసినట్టు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. అతని స్టేట్‌మెంట్ రికార్డు చేసి పంపించారు. 

దీనిపై రాజ్‌తరుణ్ కూడా స్పందించారు. తనను అరెస్టు చేయలేదని చెప్పారు. కేవలం నోటీసులు మాత్రమే అందించారని అన్నారు. సోమవారం కోర్టు హాజరుకానున్నట్టు వెల్లడించారు.మరోవైపు యాక్సిడెంట్ వీడియో ఉందంటూ రాజ్‌తరుణ్‌ను బ్లాక్ మెయిల్ చేసిన కార్తీక్‌పై కూడా కేసు నమోదు చేస్తామని ఇటు మాదాపూర్  పోలీసులు చెబుతున్నారు. కాాగా అల్కాపూర్ రింగ్ రోడ్ వద్ద రాజ్‌తరుణ్ కారు గోడను ఢీ కొట్టడంతో ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే కారును వదిలి మరో వాహనంలో అక్కడి నుంచి అతడు వెళ్లిపోయాడు. సీసీ కెమెరా ఆధారంగా గుర్తించి కేసు నమోదు చేశారు.