పోర్న్ చూస్తున్న వేలమందికి పోలీసుల నోటీసులు  - MicTv.in - Telugu News
mictv telugu

పోర్న్ చూస్తున్న వేలమందికి పోలీసుల నోటీసులు 

December 9, 2019

Police002

దేశంలో మహిళలపై, చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలకు మద్యంతోపాటు, పోర్న్ వీడియోలు కూడా కారణం. అందుకే భారత ప్రభుత్వం పోర్న్ సైట్లపై నిషేధం విధించింది. అయినా కోట్ల మంది పక్కదారుల్లో వాటిని చూస్తూనే ఉన్నారు. అంతకంటే దుర్మార్గం ఏంటంటే.. పిల్లలతో చేయించిన అశ్లీల వీడియోలను పెద్దసంఖ్యలో చూస్తుండం. దీనికి అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.

 అడల్ట్ పోర్న్‌తోపాటు, చైల్డ్ పోర్న్ చూస్తున్న వేల మందిని గుర్తించిన పోలీసులు వారికి నోటీసులు పంపనున్నారు. చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను తమిళనాడులో భారీగా చూస్తున్నట్లు, డౌన్ లోడ్ చేసుకుంటున్నట్లు అమెరికా సైబర్ నిఘా వర్గాలు తమిళనాడు పోలీసులకు ఉప్పందించాయి. ఐపీ అడ్రసుల ఆధారంగా పోలీసులు ఆ యూజర్లను గుర్తించారు. చైల్డ్ పోర్న్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్న మూడు ముఠాలను కూడా గుర్తించారు. అత్యంత నేరపూరితమైన ఈ చర్యలకు అడ్డుకట్టవేసేందుకు వారిపై ఏడేళ్ల జైలు శిక్ష పడేలా ‘పోక్సో‘ కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. ఇప్పటికే ఓ యువకుడికి వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.