టీచర్ పెళ్లికి 80 మంది పోలీసుల బందోబస్తు..! - MicTv.in - Telugu News
mictv telugu

టీచర్ పెళ్లికి 80 మంది పోలీసుల బందోబస్తు..!

February 5, 2020

pelli....

ఆయన ఓ సాధాసీదా టీచర్. ఏ రాజకీయ నాయకుడితో పరిచయం కూడా లేదు.కానీ అతడి పెళ్లికి ఏకంగా 80 మంది పోలీసులు తరలివచ్చి అతని ఊరేగింపు కోసం బందోబస్తు ఇచ్చారు.భారీ బందోబస్తు మధ్య అతని పెళ్లి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఆ గ్రామం అంతా పోలీసులు, పెళ్లివారితో నిండిపోయింది. ఈ అరుదైన ఘటన సోమవారం రాజస్థాన్‌లోని బుంది జిల్లా జారా  చోటుచేసుకుంది. 

ఇంత పెద్దఎత్తున పోలీసులు మోహరించడానికి ఓ కారణం కూడా ఉంది.  పరశురామ్‌ మేఘ్వల్‌ అనే దళిత టీచర్‌కు ఈ నెల4వ తేదీన వివాహం నిర్ణయించారు. అతడి ఊరేగింపును ఆ గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన వారు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులును ఆశ్రయించాడు. తనకు రక్షణ కల్పించాలని కోరాడు. వెంటనే స్పందించిన జిల్లా యంత్రాంగం భారీగా తరలివచ్చి పెళ్లి పూర్తి అయ్యేవరకు ఉంది. వరుడు ఊరేగింపుగా వెళ్లి ఆలయంలో పూజలు చేసి వివాహ కార్యక్రమం పూర్తి చేసుకున్నాడు. రెండు గంటల పాటు జరిగిన ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడటంతో పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.