హోటల్‌లో రేవ్ పార్టీ.. 8 మందిపై కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

హోటల్‌లో రేవ్ పార్టీ.. 8 మందిపై కేసులు

July 5, 2020

policr

కరోనా సమయంలోనూ దానితో పరాచికాలు ఆడినంత పనే చేస్తున్నారు కొందరు. మనుషులు గుమిగూడితే కరోనా వ్యాపిస్తుందని తెలిసి కూడా కొందరు పార్టీలు, పబ్బులు అంటున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో రేవ్‌ పార్టీపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అర్ధరాత్రి వేళ హోటల్‌లో మొత్తం ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. 

వారిలో నలుగురు యువకులు, నలుగురు యువతులు ఉండగా.. ఉక్రెయిన్‌కు చెందిన ఒక విదేశీ యువతి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరంతా హోటల్‌లో ఓ రూమ్‌ బుక్‌ చేసుకుని  పార్టీ చేసినట్టుగా సమాచారం. డాట్ పబ్ ఓనర్ బర్త్ డే సందర్భంగా వారు పార్టీ చేసుకున్నారట. కరోనా నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి సమయంలో పార్టీ చేసుకోవడంతో.. అందుకు సంబంధించిన సెక్షన్ల కింద నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గతంలో జూబ్లీహిల్స్‌లో రేవ్‌పార్టీ నిర్వహించిన వ్యక్తే, దీని వెనక కూడా ఉన్నాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.