ఖాకీ పైశాచికం.. బాలికపై గ్యాంగ్‌రేప్, హత్య... - MicTv.in - Telugu News
mictv telugu

ఖాకీ పైశాచికం.. బాలికపై గ్యాంగ్‌రేప్, హత్య…

February 10, 2018

అత్తింటి వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై ఎస్సై అత్యాచారం.. ఫేస్ బుక్‌లో పరిచయమైన యువతితో వివాహేతరం సంబంధం.. కోరిక తీర్చాలని మహిళకు ఫోన్లో వేధింపులు.. ఇక చాలు.. ఇవన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సాగిన ఖాకీపాపాలు.. మొత్తం దేశమంతా ఇదే తీరు. పోలీసుల్లో కొందరు ప్రజల భద్రత కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతోంటే.. ఖాకీ చొక్కాలు తొడుక్కున్న మరికొందరు ఇలాంటి కామాంధులు అబలలను కాటేస్తున్నారు.

జమ్మూకశ్మీర్లో ఒక బాలికపై కన్నేసిన పోలీసు అధికారి ఆమెను కిడ్నాప్ చేయించి, తర్వాత నిర్బంధించి అత్యాచారం చేశాడు. మరొక మైనర్ కూడా ఆమెను చెరబట్టాడు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. జమ్మూకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కతువా జిల్లా రసనా గ్రామంలోని నోమాద్ తెగకు చెందిన 8 ఏళ్ల బాలిక గత నెల 10న గుర్రాలను మేపడానికి వెళ్లింది. ఆమెను స్థానిక యువకులు కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో దీపక్ ఖుజారియా (28) ఒకడు. టీం బాలికను గుర్తించింది. దీపక్ తర్వాత ఆమెను మరోచోటుకు తీసుకెళ్లి ఓ ఇంట్లో బంధించాడు. వారం పాటు అతడు, ఒక మైనర్ ఆమెపై అత్యాచారం చేశారు. తర్వాత చంపేసి పొలాల్లో పడేశాడు. పోలీసులు ఆమె మృతదేహాన్ని కనుగొని దర్యాప్తు చేశారు.

దీపక్ తీరుపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం తెలిసింది. దీపక్ నేరాన్ని అంగీకరించడంతో జైల్లోకి నెట్టేశారు. బాలికపై దీపక్ చాలా రోజులుగా కన్నేశాడని, కిడ్నాప్, రేప్, హత్యలో అతని పాత్ర ఉందని పోలీసు అధికారులు చెప్పారు.  ఈ ఘోరంపై జమ్మూలో 20 రోజులుగా నోమాద్ తెగ ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.