యువతిపై పోలీసు అత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

యువతిపై పోలీసు అత్యాచారం

September 14, 2021

Police rape of a young woman

బాధితులకు అండగా నిలవాల్సిన రక్షక భటుడే భక్షక భటుడయ్యాడు. పైగా వాడు  బాధితురాలికి స్వయాన మామ వరుస అవుతాడు. నమ్మిన బంధువే ఆమె జీవితాన్ని నట్టేట ముంచాడు, ఆమె బతుకును బుగ్గిపాలు చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో జరిగింది. గత రెండేళ్ళుగా తన మామ అయిన హెడ్ కానిస్టేబుల్ అత్యాచారం చేశాడని 25 ఏళ్ళ యువతి ఆరోపించింది. 2019 జనవరి నెలలో కుంభమేళా కోసం తమ కుటుంబాన్ని అలహాబాద్ కు ఆహ్వానించాడని బాధితురాలు చెప్పారు. 

అప్పుడు తనను హోటల్ కు తీసుకెళ్ళి మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి అపస్మారక స్థితిలోకి చేరాక,అత్యాచారం చేసి, బ్లాక్ మెయిల్ చేయడానికి వీడియో చిత్రీకరించాడని బాధితురాలు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కోన్నారు.

గత రెండు సంవత్సరాలుగా అలహాబాద్,కాన్పూర్ లలో తన మామ తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడని ఆ మహిళ పేర్కొంది. తాను గర్భం దాల్చానని తెలుసుకొని మాత్రలు ఇచ్చి గర్భస్రావం చేసుకోవాలని సూచించాడు. మళ్లీ మామ, అతని కుమారుడు గదికి తీసుకువెళ్లి మరో వీడియో తీసి, తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో వివరించారు. తాను ప్రతిఘటించగా వారు తనను కొట్టారని, దీంతో తాను పోలీసు హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి నదిలో దూకానని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేర హెడ్ కానిస్టేబుల్ తోపాటు అతని కుమారుడిపై కేసు నమోదు చేశామని డీసీపీ చెప్పారు. నిందితుడైన పోలీసు హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి, బాధిత మహిళను వైద్యపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని డీసీపీ వివరించారు.