సూర్యాపేటలో 20 కిలోల బంగారు నాణాలు లభ్యం - MicTv.in - Telugu News
mictv telugu

సూర్యాపేటలో 20 కిలోల బంగారు నాణాలు లభ్యం

April 17, 2019

సూర్యాపేట జిల్లాలో పోలీసులు 20 కిలోల బంగారు నాణాలను స్వాధీనం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని హుజూర్​నగర్​ మండలం అమరవరం గ్రామంలో మంగళవారం రాత్రి సుమారు 11గంటల సమయంలో సింగతల వీరారెడ్డి అనే వ్యక్తి నివాసంలో ఈ నాణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరారెడ్డి తన ఇంట్లో గుంట తీసి మేక పోతుని బలిచ్చి సుమారు 20కిలోల బంగారు నాణెపు ముద్దలను దాచాడని కోదాడ డీఎస్పీ సుదర్శన్​రెడ్డి, హుజూర్​నగర్​ సీఐ భాస్కర్​ తెలిపారు. వాటిని, ఇంటి యజమాని వీరారెడ్డిని హుజూర్​నగర్​పోలీస్​ స్టేషన్​కి తరలించారు. దీనిపై పూర్తి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా.. అమరవరంలో పెద్ద ఎత్తున బంగారపు నాణెేలు లభ్యం కావడం పట్ల సంచలనం కలిగింది.