తెలంగాణలో పెద్ద ఎత్తున పోలీస్ ఉద్యోగాల భర్తీని చేపట్టిన విషయం తెలసిందే. ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్లు పూర్తవగా, అభ్యర్ధులు రాత పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ నియామక మండలి టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు ఎస్సై (ఐటీ), ఏఎస్సై (ఫింగర్ ప్రింట్), కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీలను మార్పు చేసింది. ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను ఏప్రిల్ 30కి మార్చింది. కానిస్టేబుల్ ఐటీ విభాగం పరీక్ష కుడా ఏప్రిల్ 23 నుంచి 30కి మార్పు. ఎస్సై ఐటీ విభాగం పరీక్షను మార్చి 12వ తేదీ నుంచి 11 వ తేదీకి, అలాగే ఏఎస్సై ఫింగర్ ప్రింట్స్ పరీక్షను మార్చి 12 నుంచి 11వ తేదీకి మారుస్తూ అధికారిక నిర్ణయం తీసుకుంది. అభ్యర్ధులు పరీక్షా తేదీలు మారిన విషయాన్ని గమనించాలని కోరింది.