Police removed canteens in Tenali
mictv telugu

తెనాలిలో ఉద్రిక్తత.. ఇరు పార్టీల క్యాంటీన్లను మూసేసిన పోలీసులు

September 3, 2022

గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అధికార, విపక్ష పార్టీలు పోటాపోటీగా క్యాంటీన్లను ఏర్పాటు చేయడంతో వాతావరణం వేడెక్కింది. మార్కెట్ సెంటర్లో టీడీపీ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయగా, ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల మూసేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అటు టీడీపీకి పోటీగా వైసీపీ కూడా క్యాంటీన్ ఏర్పాటు చేయడంతో కొద్ది రోజుల నుంచి నువ్వా, నేనా అన్నట్టు సాగింది. శనివారం రోజులాగే టీడీపీ వారు ఆహార పంపిణీ చేపట్టగా, ఆహారం తీసుకొచ్చిన వాహనాలు, కూరలను పోలీసులు తీసుకెళ్లారు. అటు వైసీపీ ఏర్పాటు చేసిన టెంట్లను కూడా తొలగించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగా షాపులు మూయించి మార్కెట్ సెంటరుకి వెళ్లే దారులను బంద్ చేశారు. అయినా ఇరు పార్టీల మద్ధతుదారులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, టీడీపీ నాయకులు ఆందోళన చేయడంతో వారిని అరెస్ట్ చేసి స్టేషనుకి తరలించారు.