పోలీస్ రిపోర్టర్..! - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ రిపోర్టర్..!

June 24, 2017

గీవీడియోలో  రిపోర్టింగ్ జేశే ఆయ్న మహబూబ్ నగర్ జిల్లా చింతకుంటపల్లి పోలీస్ స్టేషన్ల కానిస్టేబుల్ కొల్వు జేస్తడట,ఆడ నమస్తే తెలంగాణ రిపోర్టర్ శ్రీను గారు అక్రమంగ ఇసుక దంద జేస్తున్నరట…ఇదేంది అని అడిగితే నేనేవలనో ఎర్కేనా రిపోర్టర్ ని అని దమ్కీ ఇచ్చిండట,ఇగ నాలుగో సింహంను నమ్ముకుంటే లాభంలేదన్కొని  గా పోలీసాయ్న  ఫేస్ బుక్కుల లైవ్ వెట్టి ఇట్ల రిపోర్టర్ అవతార మెత్తిండు.సూడుండ్రి మీరే..

గీ పోలీసాయ్నరిపోర్టింగ్ జూశి..అస్సలు రిపోర్టర్ గుడ పర్శాన్  అయ్యిండు,మరి  గా శ్రీను అనెటాయ్న ఇసుక దందా నిజంగ జేస్తుండా లేదా అన్నది మాకు తెల్వది.గీ వీడియో ఫేస్ బుక్కులల్ల వాట్సప్ లల్ల మస్తు శెక్కర్లు గొడ్తుంది సూశినోళ్లంత పోలీసాయ్న రిపోర్టింగ్ పనితనం గురించి శభాష్ అంటున్రు. బై మిస్టేక్ ల కానిస్టేబుల్ అయ్యిండు గనీ అదే రిపోర్టర్ అయ్యుంటనే ….నాసామిరంగ అన్యాయం జర్గిన కాడ ఫేస్ బుక్ లైవ్  వెట్టి,ఒక్కొక్కలకి శెమ్టలు వట్టిచ్చెటోడు గావచ్చు…ఓ పోలీస్ సారు ఓసారి ట్రై జెయ్యరాదు… ఆర్నాబ్ గో స్వామిలెక్క నువ్వూ అందర్ని కడ్గి పారేయచ్చు.ఒకవేళ గీయ్న నిజంగనే రిపోర్టర్ అవతారమెత్తితే ఉత్తమ రిపోర్టర్ అని అన్ని అవార్డులు ఈయ్నకే అస్తయ్ గావచ్చు కదా.

https://www.facebook.com/mictv.in/videos/309074872884357/