గుంటూరులో 13 ఏళ్ల బాలిక.. 8 నెలలుగా.. 80 మంది.. అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరులో 13 ఏళ్ల బాలిక.. 8 నెలలుగా.. 80 మంది.. అరెస్ట్

April 20, 2022

 14

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. కరోనా అనంతర పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఓ మహిళ పదమూడేళ్ల బాలికపై 8 నెలలుగా 80 మందితో అత్యాచారం చేయించింది. విషయం తెలియగానే పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో దర్యాప్తు చేసి 80 మందిని అరెస్ట్ చేశారు. ఒక నిందితుడు లండన్‌లో ఉండగా, అతడిని రప్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వివరాల్లోకెళితే.. గతేడాది జూన్‌లో బాలిక తల్లి కరోనాతో ఆస్పత్రిలో చేరింది. అక్కడే సవర్ణకుమారి అనే మహిళ పరిచయమైంది. నువ్వు చనిపోతే బాలికను తాను దత్తత తీసుకుంటానని నమ్మబలికింది. తల్లి చనిపోగానే తండ్రికి కూడా సమాచారం ఇవ్వకుండా బాలికను తీసుకొని వెళ్లిపోయింది. కూతురు కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. నిందితులు, బాలిక తెలిపిన వివరాలు ప్రకారం సవర్ణ కుమారి ఆ బాలికను వ్యభిచార గృహానికి అమ్మేయగా, వారి తర్వాత మరొకరు అంటూ 8 నెలలుగా హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, కాకినాడలకు వ్యభిచారం కోసం తిప్పారు. పలుమార్లు బాలికను అమ్మకానికి పెట్టారు. బాలిక వయసు, ఆర్దిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు జనవరిలో తొలి అరెస్టు చేయగా, నిన్న పది మందిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు 80 మంది నిందితుల నుంచి 53 ఫోన్లు, మూడు ఆటోలు, బైకులను స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్పీ సుప్రజ వెల్లడించారు.