శానిటైజర్ పూసి మరీ చావగొడుతున్నారు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

శానిటైజర్ పూసి మరీ చావగొడుతున్నారు (వీడియో)

March 25, 2020

sanitize

కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెల్సిందే. కుటుంబంలో ఒక్కరు మాత్రమే నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి బయటికి రావాలని.. మిగతా వాళ్ళందరూ ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచింది. 

అయితే కొందరు ఆకతాయిలు మాత్రం లాక్‌డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ రోడ్లపై తిరుగుతున్నారు. అలాంటి వారికీ పోలీసులు లాఠీలతో సమాధానం చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకతాయిలను కొట్టక ముందు, కొట్టిన  తరువాత పోలీసులు లాఠీలపై శానిటైజర్లను చల్లుతూ శుభ్రం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. దీన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన మూర్ఖులను కొట్టిన తరువాత పోలీసులు వాళ్ళ ఆయుధాలను శుభ్రం చేస్తున్నారు’ అని వర్మ తెలిపారు.