ఓయూ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్.. మావోయిస్టులతో సంబంధం ఉందని.. - MicTv.in - Telugu News
mictv telugu

ఓయూ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్.. మావోయిస్టులతో సంబంధం ఉందని..

January 18, 2020

hdbbbb

ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఈ ఉదయం ఇంట్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఆయన నివాసంతో పాటు యూనివర్సిటీలోని క్వార్టర్స్‌లోనూ సోదాలు నిర్వహించారు. తర్వాత అరెస్ట్ చేసి గజ్వేల్‌కు తరలించారు.  మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతోనే ఈ సోదాలు చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు తనిఖీలు చేసేందుకు ఓయూలోకి రావడంతో లోపలికి వెళ్లకుండా కొంత మంది విద్యార్థులు అడ్డుకున్నారు. కొంత సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయినా బలవంతంగా తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. 

కాగా 2016లో నమోదైన ఓ కేసులో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. ములుగులో ఓసారి ఆయన కారులో విప్లవ సాహిత్యం దొరికినట్టుగా కేసు నమోదు చేశారు. దీంతో ఆయన మావోయిస్టుకు సానుభూతిపరుడిగా ఉన్నారని కాశీంను ఏ-2గా  చేర్చారు. ఈ సోదాలను పలువురు మేధావులు, విప్లవ రచయతల సంఘం ఖండించింది. కాగా కాశీం ఇటీవలే విప్లవం సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సమయంలో తనిఖీలు జరగడం కలకలం రేపుతోంది. చాలా రోజుల క్రితం వరవరరావును కూడా ఇలాగే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.