బిగ్‌బాస్ ఎఫెక్ట్.. నాగార్జున ఇంటి వద్ద పోలీసులు  - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్‌బాస్ ఎఫెక్ట్.. నాగార్జున ఇంటి వద్ద పోలీసులు 

July 18, 2019

Police security to nagarjuna house big boss show host .

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ మూడో సీజన్ రోజురోజుకు వివాదాస్పందగా మారిపోతోంది. నిర్వాహకులపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. బిగ్ బాస్‌ను అడ్డుకుంటామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ హెచ్చరించడంతో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నటుడు అక్కినేని నాగార్జున ఇంటికి తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పించింది. 

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర 46లోని ఆయన ఇంటివద్ద పోలీసులను మోహరించింది. రోడ్డుపై వెళ్తున్న వారిని పోలీసులు తనిఖీ చేసి పంపుతున్నారు.  బిగ్ బాస్‌ పేరుతో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందని, నాగ్ ఇంటిని ముట్టడిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించడంతో భాగంగా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు కూడా గురువారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.  ‘బిగ్‌బాస్‌’ పార్టిసిపెంట్ల ఎంపికకు మహిళలను పిలిచి లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. మరోపక్క ఈ వివాదం హస్తినకు చేరింది. యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తాలు జాతీయ మహిళాకమిషన్‌కు ఫిర్యాదు చేశారు.