హీరో సూర్య ఇంటికి తుపాకులతో పోలీసుల భద్రత - MicTv.in - Telugu News
mictv telugu

హీరో సూర్య ఇంటికి తుపాకులతో పోలీసుల భద్రత

March 10, 2022

surya

ప్రముఖ తమిళ హీరో సూర్య ఇంటికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ భద్రత కల్పించింది. తాజాగా సూర్య నటించిన ఎదుర్కుమ్ తునిందవన్ సినిమాపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగులో ఈటీ గా విడుదలైన ఈ సినిమాను పీఎంకే పార్టీ నాయకులు, వన్నియర్ సంఘానికి చెందిన వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాక, కడలూరు, విల్లుపురం జిల్లాలలో సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన స్టాలిన్ ప్రభుత్వం సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కాగా, సూర్య నటించిన గత చిత్రం జై భీమ్ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది.