హైదరాబాదులో ఇటీవల సంచలనం సృష్టించిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్ ఘటనపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాలున్న 20 మందికి నోటీసులు ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ 20 మందిలో సినీ ప్రముఖులు, పొలిటికల్ లీడర్ల పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్లెవరు అన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. కాగా, డ్రగ్స్ దందా అంతా పబ్ మేనేజర్ అనిల్‌తో పాటు మరో వ్యక్తి అభిషేక్ కనుసన్నల్లో జరిగిందని గుర్తించారు. అభిషేక్ ఫోన్ కాంటాక్ట్ లిస్టులో గోవా, ముంబై ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ఫోన్ నంబర్లు ఉన్నాయి. అక్కడి నుంచి డ్రగ్స్ తెప్పించేవాడని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అంతేకాక, గతంలో పోలీసులకు పట్టుబడిన డ్రగ్ సప్లయర్ల నెంబర్లు కూడా అభిషేక్ వద్ద ఉన్నట్టు పోలీసులు అనధికారికంగా తెలియజేస్తున్నారు.